దత్త పుత్రుడూ, దత్త తండ్రి పెట్టుకుంటున్న గిల్లికజ్జాలు
దత్తపుత్రుడుగా జగన్ చేత నామకరణం చేయబడిన పవన్ కల్యాణ్ తన ఇంటిపై ఎవరో రెక్కీ చేసారనీ, తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని కల్లుతాగిన కోతిలా చేస్తున్న గోల సద్దు మణగకముందే, దత్త తండ్రి చంద్ర బాబు కూడా నందిగామ సభలో తనమీద ఎవరో దాడికి ప్రయత్నించారని రాగం అందుకున్నారు. ఈ ఇద్దరూ కలిసికట్టుకున్నట్టుగా చేస్తున్న ఆరోపణలు, వాటికి పచ్చమీడియా కల్పిస్తున్న ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడి వేడిగా ఉంది. అసలు వీళ్ళిద్దరూ చేస్తున్న ఆరోపణలలో నిజమెంత? ఈ ఆరోపణల వెనక అసలు ఉద్దేశం ఏంటి?
అక్టోబర్ 18 వ తేదీన మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తనని పేకేజీ స్టార్ గా పిలుస్తున్నవాళ్ళని చెప్పుతో కొట్టాలి అని ఆవేశంతో ఊగిపోతూ పిలుపునిచ్చారు. పేకేజీ స్టార్ అని అసలు ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారు? పవన్ కల్యాణ్ కి సీరియస్ రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకే ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కానీ, పార్టీని బలోపేతం చేయడం మీదకానీ దృష్టి పెట్టరు. సినిమాల్లో ఆయన చేసే ఫీట్లని, చెప్పే డైలాగులని, తెరమీద ఆయన వేసే వేషాలని నిజాలని నమ్మే అమాయకపు అభిమాన గణ ఆదరణ ఉంది. దాన్ని ఆయన చంద్రబాబుకి తాకట్టు పెట్టి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాడు అని ఒకప్పుడు ఆయన్ని అనుసరించిన నాయకులే చేసే ఆరోపణ. అందుకే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక వోటుని చీల్చడానికి విడిగా పోటీ చేస్తాడు, జగన్ అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక వోటుని ఏకం చేయడానికి చంద్రబాబుతో కలిసిపోటీ చేస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఆయన్ని పేకేజీ స్టార్ అని పిలవడం. అలా పిలుస్తున్నందుకు ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆయన అభిమానులకి, ప్రజలకి అలాంటి అనుమానం రావడానికి ఆస్కారం లేని విధంగా ఆయన ప్రవర్తన ఉంటుందని ఆశిస్తాం. కానీ ఆయన నన్ను పేకేజీ స్టార్ అని పిలవద్దు అని గొంతు చించుకుని అరిచి, అలా పిలిస్తే చెప్పు తీసుకుని కొడతా అని బూతుల తిట్టిన కొన్ని గంటలకే చంద్రబాబుతో హోటల్ లో కలుస్తారు, బహిరంగంగా రొమాన్స్ చేస్తారు. ఆయనముందు బచ్చా లాగా చేతులు కట్టుకుని నిలబడి వినయంగా తలొచుకుని ముసిముసి నవ్వులు నవ్వుతారు. ఇదంతా చూసేవాళ్ళకి వింతగా, పిచ్చిలా అనిపించినా చంద్రబాబు భాషలో చెప్పలంటే ఇదొక పొలిటికల్ కంపల్షన్. మామూలు భాషలో చెప్పుకోవాలంటే… కూటికోసం కోటి పాట్లు అన్నట్టు పేకేజీ కోసం పడే పాట్లు ఇవన్నీ. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి.
వైజాగ్, విజయవాడలలో ఆయన అసభ్య ప్రవర్తన, ఆయన అభిమానుల వీరంగంమర్చిపోకముందే ఆయన లొకేషన్ ని ఇప్పటం గ్రామానికి మార్చారు. బహుశా షూటింగ్ షెడ్యూల్ లో వచ్చిన బ్రేక్ ని ఆవిధంగా సద్వినియోగం చేసుకుని ఉండొచ్చు. ఇప్పటం గ్రామంలో జగన్ ప్రభుత్వం అమాయకపు ప్రజల ఇళ్ళు కూల్చేస్తుందని ఆరోపణలు చేస్తూ ఆయన చూపించిన సినిమాటిక్ హీరోయిజం పీక్స్ కి చేరుకుంది. భద్రతని గాలికొదిలి వేగంగా వెళ్తున్న కారు మీద కూర్చుని ఆయన పోజులిచ్చారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టుపై మేస్తుందా అని సామెత చెప్పినట్టు- తమకి ఆదర్శంగా ఉండాల్సిన తమ అభిమాన నటుడే అంత ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన కనుపరుస్తుంటే ఆయన అభిమానులు ఊరుకుంటారా? డిసిప్లిన్ లేని గుంపుగా పవన్ కల్యాణ్ చేతే మందలింపబడిన ఆయన అభిమానులు ఇంకా చెలరేగిపోయారు. కారుకి అటూ ఇటూ వేలాడుతూ ప్రయాణం చేసారు. ఇప్పటం గ్రామంలో ఆయన స్పీచ్ ఇంకా విచిత్రం. "ఇప్పటం లో రోడ్లు విస్తరణ అవసరమా? మమ్మల్ని చంపడానికి రెక్కీలు నిర్వహిస్తారా? 250 కోట్లు ఇస్తారా? 250 కోట్లు కాదు వెయ్యి కోట్లు ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చి దొబ్బండి" అంటూ తీవ్రవాదిలా ఉద్రేకపూరిత భాషతో ఉపన్యాసం ఇచ్చారు.
దత్తపుత్రుడి ప్రవర్తన ఇలా ఉంటే దత్త తండ్రి చంద్రబాబు తానేమీ తగ్గేది లేదు అన్నట్టు
నందిగామలో తన పై రాయితో దాడిచేసారు అని ఒక చిన్న రాయి ముక్కని చూపిస్తూ అదేదో గ్రెనేడ్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇదే చంద్రబాబు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్ మీద మీద హత్యాయత్నం జరిగితే ఆఫ్టరాల్ కోడికత్తి అంటూ హేళనగా మాట్లాడడం ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు మాత్రం రాయి ముక్క weapon of mass destruction అయిపోయింది చంద్రబాబు కి.
అసలు నందిగామ శాసన సభ్యులైన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ ఎంత సౌమ్యులో నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఉన్నత విద్యావంతులైన ఈ డాక్టర్ బ్రదర్స్ స్నేహశీలురుగా, సాత్వికులుగా ప్రత్యర్ధి పార్టీ లోని నాయకులతో సైతం అభినందించబడుతుంటారు. నిరంతరం నియోజకవర్గ శ్రేయస్సు, నియోజక వర్గ ప్రజల సంక్షేమం తప్ప రాళ్ళేయించడం, అవినీతి చేయడం లాంటి చంద్రబాబు తరహా చిల్లర రాజకీయం వీళ్ళు చేసినట్టు వీళ్ళ రాజకీయ చరిత్రలోనే లేదు. మరెందుకు చంద్రబాబు, ఆయన ఆధ్వర్యంలో నందిగామ మాజీ శాసన సభ్యురాలైన తంగిరాల సౌమ్య ఈ అబధ్ధపు ఆరోపణలు చేస్తున్నారు? ఆ ఆరోపణలు నిజమని నిరూపించేటట్టైతే రాజకీయాలనుండి తప్పుకుంటాం అని ధైర్యంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ చేసిన సవాల్ ని స్వీకరించలేక ముఖం చాటేస్తున్నారు?
ఆలోచిస్తే అర్ధమయ్యేదేంటంటే…దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కి, దత్తతండ్రి చంద్ర బాబు కి ఓట్లడగడానికి ప్రజలదగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలో అర్ధం కావట్లేదు. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని, నవరత్నాలు అనే సంక్షేమ పధకాలతో పేదల కడుపు నింపి, బడుగు బలహీన, బహుజన వర్గాలని అర్ధికంగా బలపరిచి, వాళ్ళ ఆత్మగౌరవంతో, స్వాలంబన దిశగా, తలెత్తుకుని జీవించేలా చేయూతనిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అమ్మవొడి, నాడు నేడు లాంటి పధకాల ద్వారా విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి శిధిల స్థితిలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేటు స్కూల్స్, హాస్పిటల్స్ కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక YSR బడుగు వికాసం, YSRనేతన్న నేస్తం, వాహన మిత్ర, చిరువ్యాపారులకోసం ఉద్దేశించిన జగనన్న తోడు…ఇలా సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆర్ధికంగా మేలు జరిగేలా జనరంజకంగా పాలిస్తున్నాడు జగన్. కరోనా సమయంలో ప్రజలని కన్నబిడ్డల్లా సాకిన ఆయన మానవతతో కూడిన పాలనకి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనసులు సలాం అంటున్నాయి. మరి ఇలాంటప్పుడు జనం ముందుకు వెళ్ళి ఎలా ఓట్లడగాలి? అందుకే ఈ గిల్లికజ్జాలకి తెర తీసారు చంద్రబాబూ, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయ్యడానికి కంకణం కట్టుకున్న ఈ దుష్ట ద్వయం- సభ్యత, సంస్కారం మరిచి, హుందాతనం విడిచిపెట్టి బూతులతో దూషించడానికి, హింసతో కూడిన దాడులకి తమ అభిమానులని, పార్టీ సభ్యులని ప్రోత్సహించడానికి సైతం వెనకాడట్లేదు. ఎలాగైనా జగన్ ని రెచ్చగొట్టి, ఆయన శాంతం కోల్పోయేలా చేసి, తాము దిగజారిన బురదలోకి ఆయన్నీ లాగి, ఆవిధంగానైనా ఆయనతో సమవుజ్జీగా కనపడాలని వీళ్ళిద్దరూ పడుతున్న పాట్లు ఇవి. ప్రజా శ్రేయస్సుకన్నా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సిగ్గువిడిచి పవన్ కల్యాణ్, చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఇవి.
అయితే జగన్ మాత్రం ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వుతూ, ప్రజలకి తాను చేయాలనుకున్న మేలు చేస్తూ, మరిన్ని ప్రజా సంక్షేమ పధకాలని ప్రవేశపెడుతూ, రాష్ట్రాన్ని గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య మోడ లో అభివృధ్ధి దిశగా నడిపించడంలో బిజీగా ఉన్నాడు.
Comments
Post a Comment