Be like Jagan: జగన్ జీవితం నుంచి నేర్చుకోదగ్గ వ్యక్తిత్వ వికాస పాఠాలు
1) గొప్ప కల కను
: నీ కల నువ్వే కను. నువ్వు ఎటువంటి కల కనాలో చెప్పే అధికారం ఈ ప్రపంచానికి ఇవ్వకు. ఎందుకంటే ఈ ప్రపంచం గొప్పకలలు కనడం మర్చిపోయి చాలాకాలం అయింది. ఎప్పుడైతే ఈ దేశంలో MNC లు, కార్పొరేట్ల రాజ్యం మొదలయిందో అప్పుటినుంచే ఈ దేశ యువత గొప్ప కలలు కనడం, గొప్పగా ఏదన్నా చేయడానికి ప్రయత్నించడం మర్చిపోయి బతుకుదెరువు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వీళ్ళ కలలన్నీ సుఖవంతమైన జీవితం చుట్టూ తిరిగే స్వార్ధపూరితమైన కలలు. అటువంటి మరుగుజ్జు మనస్తత్వాలు కలిగిన మనుష్యుల మధ్య జగన్ అన్న ఒక దేవదారు వృక్షంలా ఉన్నతంగా కనిపిస్తుంటాడు నాకు. ఆయన కన్న కల చిన్న కల కాదు. ఒక రాష్ట్రానికి నేను CM కావాలి అని ఆయన కల కన్నప్పుడు ఆయన్ని రాష్ట్ర మంత్రి లేదా కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. "చిన్నగా మొదలెట్టు, అనుభవం సంపాదించుకో" అని అనేకమంది ఆయనకి ఉచితసలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ అన్న వాళ్ళ సలహాలు తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసాడు. ఆయన తన కలని కనే అధికారం వేరేవాళ్ళకి ఇవ్వలేదు. ఏ మంత్రి పదవిలో పనిచేసిన అనుభవమూ లేకుండానే ఏకాఎకిన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన గొప్ప స్వాప్నికుడు జగన్.
2) లిల్లీఫుట్ సలహాలు ఇచ్చే వాళ్లని దూరం పెట్టు: పెద్ద కలలు కనడం పాపం అని నమ్మే కొంతమంది మన శ్రేయోభిలాషుల రూపంలో ఉంటారు. వాళ్ళు నీ కలని కత్తిరించి చిన్నది చేసి ఇదీ నువ్వు కనాల్సిన కల సైజ్ అని నిన్ను ఒప్పించాడనికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా నీ మేలుకోసమే అని నిన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళూ నమ్ముతారు. అలాంటివాళ్ళని దూరం పెట్టు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని కలుస్తానని మాట ఇచ్చినందుకు ఓదార్పు యాత్ర చేస్తాను అని జగన్ అన్న అన్నప్పుడు ఇలాంటి కొంతమంది శ్రేయోభిలాషులే ఆయన్ని ఆపడానికి ప్రయత్నించారు. "అది అవసరమా?" "కొంతకాలం ఆగొచ్చుగా?" "అంత తొందరెందుకు", "మరీ అంత దూకుడైతే ఎలా? "అధిష్టానం మాట విను", ఇలాంటి మేలుకోరి చెబుతున్నట్టుగా అనిపించే సలహాలతో ఆయనకి మంచి చేస్తున్నామని భావించారు. ఇలా చెప్పినవాళ్ళు రాజకీయాల్లో తలపండిపోయిన వాళ్ళు, రాజకీయ వ్యూహాచతురులుగా పరిగిణింప బడినవాళ్ళు. అయినా జగన్ అన్న వాళ్లని పట్టించుకోలేదు. తాను నమ్మినదానిని మనస్ఫూర్తిగా నమ్మి ముందుకెళ్లాడు. అప్పుడు ఆయనది మూర్ఖత్వం, మొండితనం అన్నవాళ్ళు ఇప్పుడు ఆయన గెలిచాక ఆత్మవిశ్వాసం, పట్టుదల అంటున్నారు. కాబట్టి జనం మాటల్ని పట్టించుకోకు. నువ్వు నమ్మింది చెయ్యి.
3) నిరంతరం నేర్చుకో.
2004 ఎన్నికలలో జగన్ అన్న కాంగ్రెస్ కి ప్రచారం చేస్తూ కాకినాడ వస్తే చూసాను. అప్పడు ఆయన్ని చూడడానికి పెద్దగా జనం రాలేదు. ఆయన ఉపన్యాసం గొప్పగా లేదు. ఆయన తెలుగు సరిగా మాట్లడలేకపోయారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి, నాయకుడిగా ఎదగాలన్న తపన తప్ప అప్పుడు ఆయనకి ఏదీ పెద్దగా రాదు. అదే జగన్ ని ఈరోజు చూస్తే ఆయన అనర్గళంగా తెలుగు మాట్లాడుతున్నారు. లక్షలాది ప్రజల ముందు గొప్పఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అయింది? నిరంతరం నేర్చుకోవడం ద్వారా. తనకి తెలియనిది తెలుసుకోవాలన్న దాహం వల్ల. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి లోకేష్ కి తెలుగు నేర్పే ప్రయత్నం జరిగి అది వృధా ప్రయాసగా మిగిలింది. ఎందుచేత? నేర్చుకునే స్వభావం, వ్యక్తిత్వం ఆయనకి లేదు. అందుకే మనల్ని మనం మెరుగుపరుచుకోడానికి ఎలా నేర్చుకోవాలో జగన్ అన్న ని చూసి నేర్చుకోవాలి.
4)ఒత్తిడిలో విరిగిపోని మానసిక దృఢత్వం సంపాదించుకో:
మొదట వాళ్ళు నిన్ను పట్టించుకోరు. తర్వాత నీ పట్టుదల చూసి నవ్వుతారు. తర్వాత స్థాయిలో వాళ్ళు నిన్ను ఆపడానికి నీతో యుధ్ధానికి దిగుతారు. ఆ తర్వాత మొదలవుతుంది నీ గెలుపు అన్నారు మహాత్మా గాంధీ. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే ప్రపంచానికి గొప్ప కలలు కనేవాళ్ళన్నా, అవి నిజం చేసుకోడానికి ప్రయత్నించేవాళ్ళన్నా భయం. అందుకే వాళ్ళని కూడా తమలాగా సాధారణ జన జీవన స్రవంతిలో కలిపేయాలని ప్రయత్నిస్తుంది. నీ ఎదుగుదల మొగ్గలోనే తుణిచేయలని, నీ స్వప్నాన్ని అణిచేయాలని, నీ ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఆర్పేయాలని ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు నీ కలని కాపాడుకో. జగనన్నలా విరిగిపోని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకో.ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలతో చేతులు కలిపి, రాజ్యాంగ వ్యవస్థలని దుర్వినియోగం చేసి, మీడియా సహాయంతో ఆయనమీద చేయని నేరాలు మోపి, వ్యక్తిత్వహననం చేసి పాతిపెట్టేస్తే, అయన ఒక విత్తనంలా ఆ చీకటిని చీల్చుకుని, ఆ భూమిని బద్దలు కొట్టుకుని మొలిచి, మహావృక్షంలా ఎదిగాడు. తనని విరగ్గొట్టాలని కొట్టిన ప్రతీ దెబ్బతో తనని తాను మలుచుకుని పదును పెట్టుకుని ఆయుధంగా మార్చుకుని, ఒత్తిడిలో పగిలిపోవడానికితాను ఒక గాజు పలకని కాదని, ఒక ఉక్కు ముక్క అనీ ప్రపంచానికి తనని తాను నిరూపించుకున్నాడు.
5)ప్రేమని పంచు:
ద్వేషించడం సులభం. ప్రేమించడం కష్టం. ముఖ్యంగా నీకు అన్యాయం జరిగినప్పుడు. నువ్వు చేయని తప్పులు నీ మీద మోపి ఈ ప్రపంచం నిన్ను దోషిగా తీర్చినపుడు. ఏ నేరం చేయకపోయినా నువ్వు శిక్ష అనుభవించినపుడు. జగనన్న ముందు రెండు దారులు ఉండినయి. ఒకటి ప్రేమ.. రెండోది ద్వేషం, ప్రతీకారం. కానీ జగనన్న ప్రేమనే ఎంచుకున్నాడు. "కంటికి కన్ను" అన్న ప్రతీకార సిధ్ధాంతానికి ప్రతిగా ఒకచెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే క్షమా మార్గాన్నే ఎన్నుకున్నాడు. సహానుభూతిని(empathy), తగ్గింపు స్వభావాన్ని(humility), ప్రేమనే ఎన్నుకున్నాడు.
జగన్ అన్నలా ప్రజల్ని ప్రేమించే మరోనాయకుడిని ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చూడలేం.ఆ ప్రేమకి అంతులేదు. తాను పొందిన అవమానాల ద్వారా, కష్టాల ద్వారా ప్రజల బాధని, లేమిని, వాళ్ళ సమస్యలని సహానుభూతి చెందే గొప్ప పరిణితి సంపాదించుకున్నాడు గనుకనే ఇది సాధ్యం అయింది. తాను ప్రేమించిన వాళ్ల మొఖాలపై చిరునవ్వు చూడడమే ప్రేమ పరమార్ధం. అదే ఈరోజు జగనన్న చేస్తుంది. జీవితాల్ని మెరుగుపరచడం. చిరునవ్వులు పూయించడం.
ఆ గోప్ప నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని ఇటువంటి రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.
- Dr. Arun kumar Monditoka. Ph.D
MLC
Comments
Post a Comment