నువ్వు నమ్మినదానికోసం నిలబడడం అనే మరుగునపడిపోయిన కళ
The forgotten art called standing up for something-
జస్టిస్ చంద్రు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి షాక్ నిచ్చాయి. అవి YSRCP ని కూడా ఆశ్చర్యపరిచి ఉంటాయి. ఎందుకంటే వారికి అనూహ్యంగా, ఊహించని వైపు నుంచి మద్దతు దొరికింది. న్యాయ వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడడానికి కూడా జంకుతున్న ఈరోజుల్లో, అనేకమంది YSRCP మద్దతుదారులు,సోషల్ మీడియా వాలంటీర్లు నెలలు తరబడి జైళ్లలో బెయిల్ రాక మగ్గుతున్న ఈరోజుల్లో, జస్టిస్ చంద్రు ఈ విషయాన్ని గురించి అంత వివరంగా మాట్లాడడం వాళ్ళకి చాలా ఓదార్పు నిచ్చి ఉంటుంది. అంతేగాక, పైకి కనిపించకపోయినా, పైకి ఎవరూ మాట్లాడకపోయినా, ఇక్కడి హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతీ చిన్న విషయంలో తలంటుతున్నట్టుగా, మొట్టికాయలు వేస్తున్నట్టుగా పచ్చమీడియా లో జరుగుతున్న ప్రచారం, దానివెనక ఉన్న అసలు కారణాల గురించి జాతీయ స్థాయిలో న్యాయ వర్గాలలో చర్చ జరుగుతుంది అనిపిస్తుంది.
నేను కొంతమంది ఆంధ్రప్రదేశ్ లాయర్లతో casual గా మాట్లాడుతున్నప్పుడు జగన్ కి వ్యతిరేకంగా కోర్టు అవలంబిస్తున్న వైఖరిని వాళ్ళు పూర్తిగా enjoy చేస్తున్నారనిపించింది. వాళ్లకేమీ political inclinations లేకపోవచ్చు. కానీ తాము కూడా ఆ వ్యవస్థలో భాగం కాబట్టి, ఆ వ్యవస్థ aggressive గా కండలు మెలేస్తూ ప్రజలెన్నుకున్న legislature కన్నా బలవంతునిగా తమని తాము చూపించుకోవడం వాళ్ళకి గర్వాన్నిస్తుంది. మేమంటే సీఎం కూడా భయపడుతున్నాడన్న గర్వం మా స్నేహితులకి high ఇస్తుందన్నమాట.
జర్నలిస్ట్ సాయి పంచ్ ప్రభాకర్ గురించి చేసిన ఒక లైవ్ షో చూసాను. "పంచ్ కి పంచ్ పడిందా?" లాంటి టైటిల్ తో ఆయన చేసిన ఆ ప్రోగ్రామ్ లో పంచ్ ప్రభాకర్ తో పాటు కొంతమంది న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. వాళ్లలో జనసేన న్యాయ విభాగం నుంచి ఒక న్యాయవాది కూడా ఉన్నారు. అమెరికా నుంచి లైన్లోకి వచ్చిన ప్రభాకర్ ని జర్నలిస్ట్ సాయి మాటిమాటికీ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మీ వెనక ఎవరున్నారు? ఎవరికోసం రాశారు, వీడియోలు పెట్టారు? మీ కోర్టు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు? ఇప్పటికైనా, విషయం CBI, interpol వరకూ వచ్చాక అయినా మీకు మీరు చేసింది తప్పు అనిపించట్లేదా? మీకు ఇంకా బుధ్ది రాలేదా? అంటూ. ఇక జనసేన లాయర్ గారైతే గొంతులో బోళ్ళంత కసినింపుకుని "నీకుంది ప్రభాకర్, నీ పనైపోయింది" అన్న లెవెల్ లో మాట్లాడ్డం మొదలెట్టారు. వీళ్ళందరి గొంతుల ధ్వనిలో ప్రభాకర్ అంటున్న మాట ఎవరూ వినిపించుకోలేదు. అది "నేను ఎందుకు చేసాను అంటే అది నా స్వభావం కాబట్టి". నాకు అన్యాయం అనిపించినపుడు గొంతెత్తడం, అది అన్యాయం అని చెప్పడం, ఒక్కడ్నే అయినా నేను నమ్మినదానికోసం నిలబడడం నా స్వభావం! అదీ ప్రభాకర్ చెప్పదల్చుకున్నది. కానీ అక్కడున్న జర్నలిస్ట్ సాయి గారికి గానీ, అక్కడ కూర్చున్న న్యాయ నిపుణులకి గానీ, నా లాయర్ స్నేహితులకు గానీ ఆయన చెప్పింది బుర్రకి ఎక్కట్లేదు అనిపించింది. అలా ఎవరైనా తాము నమ్మినడానికోసం నిలబడడం, జైలుకి వెళ్ళడానికి కూడా సిధ్ధపడడం అనేది వాళ్ళకి ఊహకి కూడా అందని విషయం. వాళ్ళ దృష్టి లో గెలిచేదే న్యాయం. కోర్టులు చెప్పిందే న్యాయం. అంతేగానీ ఎదుటి వాడి వాదనలో న్యాయాన్ని, అది మనం అంగీకరించలేనప్పటికీ, వాడు మనకి నచ్చనప్పటికీ, గుర్తించడం, వాడికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడం మర్చిపోయారు. అందుకే జస్టిస్ చంద్రు, ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు కాకపోయినా, తన కళ్ళముందు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే నిర్భయంగా తాము నమ్మిన సిధ్ధాంతాలకోసం నిలబడే జస్టిస్ చంద్రులాంటి ధైర్యవంతులు ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు కేవలం కుల పిచ్చితో, మత విద్వేషంతో, స్వలాభం కోసం, మంచి చెడుల విచక్షణ కోల్పోయిన మనలాంటి పిరికి,వెన్నెముక లేని, డొల్ల మనుష్యులం మాత్రం మిగిలాం.
Comments
Post a Comment