అయ్యలారా కేవలం వైజాగ్ గురించి మాత్రమే ఏడవకండి. మీ ప్రాంతాలగురించీ ఏడవండి
పచ్చని పొలాలని చూసి ప్రకృతి అనీ తవ్వబడుతున్న కొండలని చూసి విధ్వంసం అనీ అనుకోవడం మూర్ఖత్వం. రెండూ విధ్వంసాలే! ఒకటి విధ్వంసంలా అనిపిస్తుంది రెండోది అనిపించదు అంతే. Facebok లో రిషికొండ తవ్వబడుతున్న ఒక పిక్చర్ share చేయబడుతుంది. అందరూ గుండెలు బాదేసుకుంటున్నారు వైజాగ్ నాశనం అయిపోతుంది అని. ఇక్కడే ఒక visual/ image యొక్క power మనకి అర్ధమవుతుంది. పచ్చని పొలాలన్నీ ఒకప్పుడు అడవులు. చెట్లు నరికి పొలాలుగా మార్చబడ్డాయి. పచ్చగా ఉన్నంత మాత్రాన అది deforestation కాకపోదు. కానీ అది మన మెదడు మీద భయానకమైన ప్రభావం చూపించదు అంతే తేడా!. కానీ కొండ తవ్వబడుతున్న దృశ్యం, అది కూడా proclainer లో తవ్వబడుతున్న దృశ్యం మనల్ని ఎక్కువ కలిచివేస్తుంది. బహుశా అదే తవ్వకాలు పంచెలు, చీరలు కట్టుకున్న కూలీలు చేస్తే దాని ప్రభావం మనమీద అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే అమరావతి లో జరిగిన ప్రకృతి విధ్వంసం మనకి విధ్వంసం లా అనిపించి ఉండకపోవచ్చు. మనకి పోస్టులు పెట్టడానికి, కవితలు రాయడానికి ప్రేరణ లభించి ఉండకపోవచ్చు. 1995 లో నేను వైజాగ్ లో eamcet కోచింగ్ కోసం ఒక సంవత్సరం ఉన్నాను. అప్పుడు ఆశీల్ మెట్ట flyover లేదు. NAD కొత్తరోడ్డు ద...