Be like Jagan: జగన్ జీవితం నుంచి నేర్చుకోదగ్గ వ్యక్తిత్వ వికాస పాఠాలు
జగన్ మోహన్ రెడ్డి గారి birth day సందర్భంగా ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోదగ్గ కొన్ని వ్యక్తిత్వ వికాస పాఠాలు. 1) గొప్ప కల కను : నీ కల నువ్వే కను. నువ్వు ఎటువంటి కల కనాలో చెప్పే అధికారం ఈ ప్రపంచానికి ఇవ్వకు. ఎందుకంటే ఈ ప్రపంచం గొప్పకలలు కనడం మర్చిపోయి చాలాకాలం అయింది. ఎప్పుడైతే ఈ దేశంలో MNC లు, కార్పొరేట్ల రాజ్యం మొదలయిందో అప్పుటినుంచే ఈ దేశ యువత గొప్ప కలలు కనడం, గొప్పగా ఏదన్నా చేయడానికి ప్రయత్నించడం మర్చిపోయి బతుకుదెరువు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వీళ్ళ కలలన్నీ సుఖవంతమైన జీవితం చుట్టూ తిరిగే స్వార్ధపూరితమైన కలలు. అటువంటి మరుగుజ్జు మనస్తత్వాలు కలిగిన మనుష్యుల మధ్య జగన్ అన్న ఒక దేవదారు వృక్షంలా ఉన్నతంగా కనిపిస్తుంటాడు నాకు. ఆయన కన్న కల చిన్న కల కాదు. ఒక రాష్ట్రానికి నేను CM కావాలి అని ఆయన కల కన్నప్పుడు ఆయన్ని రాష్ట్ర మంత్రి లేదా కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. "చిన్నగా మొదలెట్టు, అనుభవం సంపాదించుకో" అని అనేకమంది ఆయనకి ఉచితసలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ అన్న వాళ్ళ సలహాలు తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసాడు. ఆయన తన కలని కనే అధికారం వేరేవాళ్ళకి ఇవ్వ...