దత్త పుత్రుడూ, దత్త తండ్రి పెట్టుకుంటున్న గిల్లికజ్జాలు
దత్తపుత్రుడుగా జగన్ చేత నామకరణం చేయబడిన పవన్ కల్యాణ్ తన ఇంటిపై ఎవరో రెక్కీ చేసారనీ, తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని కల్లుతాగిన కోతిలా చేస్తున్న గోల సద్దు మణగకముందే, దత్త తండ్రి చంద్ర బాబు కూడా నందిగామ సభలో తనమీద ఎవరో దాడికి ప్రయత్నించారని రాగం అందుకున్నారు. ఈ ఇద్దరూ కలిసికట్టుకున్నట్టుగా చేస్తున్న ఆరోపణలు, వాటికి పచ్చమీడియా కల్పిస్తున్న ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడి వేడిగా ఉంది. అసలు వీళ్ళిద్దరూ చేస్తున్న ఆరోపణలలో నిజమెంత? ఈ ఆరోపణల వెనక అసలు ఉద్దేశం ఏంటి? అక్టోబర్ 18 వ తేదీన మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తనని పేకేజీ స్టార్ గా పిలుస్తున్నవాళ్ళని చెప్పుతో కొట్టాలి అని ఆవేశంతో ఊగిపోతూ పిలుపునిచ్చారు. పేకేజీ స్టార్ అని అసలు ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారు? పవన్ కల్యాణ్ కి సీరియస్ రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకే ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కానీ, పార్టీని బలోపేతం చేయడం మీదకానీ దృష్టి పెట్టరు. సినిమాల్లో ఆయన చేసే ఫీట్లని, చెప్పే డైలాగులని, తెరమీద ఆయన వేసే వేషాలని నిజాలని నమ్మే అమాయ...